బాబు ష్యూరిటీ.... మోసం గ్యారెంటీ : వైయస్ జగన్

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పారని మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధ్యకుడు వైయస్ జగన్ మండిపడ్డారు. బాబు ష్యూరిటీలు.... మోసం గ్యారెంటీలు అనే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉందని అన్నారు.


Published on: 05 Mar 2025 14:54  IST

తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధ్యకుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....

ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీన గవర్నర్ గారి స్పీచ్, అదేరకంగా 28వ తేదీ ప్రవేశపెట్టిన బడ్జెట్ వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెబుతున్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం తరఫు నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద ఇటువైపున, నాణేనికి ఇటువైపున వర్షన్ వినిపించే కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు గారి 2 బడ్జెట్లు.. 28న తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ తో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినట్లయ్యింది. ఇవి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేవి ఏమిటంటే.. చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజల్లో మోసం చేసిన తీరు.. తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ.. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతోంది. బడ్జెట్ గానీ, గవర్నర్ ప్రసంగం ఏది చూసినా కనిపించేది రెండే రెండు. ఒకటి పరనింద. రెండు ఆత్మస్తుతి. రెండో బడ్జెట్ ప్రవేశపెడుతున్నా కూడా ఈరోజుకూ వాళ్ల నోటిలోంచి వచ్చే మాటలు జగన్ ఇట్టా.. జగన్ అట్టా.. ఆ పాలన, ఆ పాలన, ఈ పాలన ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్లు ఇచ్చిన మాటల విషయమేమిటి, హామీల విషయమేమిటి, వాటికి సంబంధించి ఏం చెబుతున్నారు. ఆ సూపర్ సిక్స్, ఆ సూపర్ సెవెన్ విషయాలేమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలిచ్చారు. వాటి పరిస్థితి ఏమి అని అడిగితే మాత్రం ఏ ఒక్కరి నోట్లో కూడా సమాధానాలు సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సెవెన్ అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన, ఆయన దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి. రకరకాల పద్ధతుల్లో పోజులిస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నామని చెబుతూ ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. కరపత్రాలు ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికీ పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది చూస్తే టోటల్ గా కేటాయింపులు చూస్తేనే అరకొర. అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఓ పెద్ద బోడి సున్నా కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక రెండో ఏడాది కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తున్నాయి. 

సూపర్ సిక్స్ ....సూపర్ సెవెన్.. అంతా మాయ

ప్రధానమైన హామీలు గురించి చూస్తే.. మొదటిది యువతకు ఉద్యోగాలకు సంబంధించి చంద్రబాబు చెప్పిన హామీ. తాను చెప్పాడు.. సూపర్ సిక్స్ అన్నాడు. సూపర్ సెవెన్ అన్నాడు. నిరుద్యోగులందరికీ రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు వచ్చే దాకా రూ.3 వేల నిరుద్యోగ భృతి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే గత ఏడాది బడ్జెట్ లో కూడా ఆ నిరుద్యోగభృతి, 20 లక్షల మంది రూ.3 వేలు అంటే దాదాపుగా రూ.7200 కోట్లు.. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడా అంటే అదీ లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో, గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచులో, ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీ కూడా ప్రతి శాసనసభ్యుడికి, కౌన్సిల్ సభ్యులందరికీ బుక్స్ కూడా పంపిణీ చేశారు. వాళ్లు ఇచ్చిన దాంట్లో చూస్తే 9 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చేశాం అని ఏకంగా బుక్కుల ద్వారా ప్రింటు కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ. బుక్కు. ‘‘ఇందులో మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్నిపంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్కసెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్ కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. ’ గవర్నర్ గారి ప్రసంగం అని చెబుతూ, గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు వీళ్ల అబద్ధాలు, మోసాలు.

నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో కేటాయింపులు ఏవీ? 

బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనమిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కు సంబంధించిన రెండో సోషియో ఎకనమిక్ సర్వే రిలీజ్ చేశారు. ఇందులో వీళ్లు ఏకంగా ప్రింటు కొట్టేశారు. ఎంఎస్ఎంఈ సెక్టార్ లో 2024-25కు సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామన్నారు. ఇచ్చేశారట. అసెంబ్లీలో పంచిపెట్టిన కాపీలివి. రిలీజ్ చేసిన కాపీలు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగుల్ని మోసం చేసే కార్యక్రమం. రూ.3 వేల నిరుద్యోగభృతి ఇవ్వకుండా, వాళ్లందరికీ నెలనెలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి రూ.36 వేలు ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్లకు ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలేవీ చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పి.. 4 లక్షల ఉద్యోగాలని గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించేస్తారు. సోషియో ఎకనమిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేశామని చెబుతారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరీ ముఖ్యంగా పిల్లలకు ప్రతి ఒక్కరికీ నిరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36 వేలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు. మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతాఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు రూ72 వేలు ప్రతి పిల్లాడికీ చంద్రబాబు మోసం, దగా, వంచన, బకాయిలు.. అన్ని పదాలు పెట్టొచ్చు. 

నిరుద్యోగులను నిలువునా దగా చేస్తున్నారు

ఈరోజు పరిస్థితి ఏమిటని చూస్తే నిరుద్యోగభృతీ లేదు. అటు ఉద్యోగమూ లేదు. ఉన్న ఉద్యోగాలన్నింటినీ వరుసబెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతోంది. ఇవి కనిపిస్తున్న సత్యాలు. అదే ఒకసారి గమనించినట్లయితే వైయస్సార్ సీపీ పాలనలో, మా పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే, కేవలం 4 నెలల కాలంలో.. వైయస్సార్ సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం, అక్టోబర్ కల్లా, గాంధీ జయంతికల్లా ఏకంగా 1.30 లక్షల ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు పని చేస్తూ కనిపించేట్టుగా చేశాం. నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో 2.66 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు రిక్రూట్ చేశాం. ఎవరూ కాదనలేని సత్యాలు ఇవన్నీ. ఆప్కాస్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు కరెక్టుగా చెప్పాలంటే 96 వేల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. పే స్లిప్పులతో సహా, ఆధార్ కార్డు నంబర్ తో సహా చెప్పగలుగుతాం. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ కు రెగ్యులరైజ్ చేస్తూ వాళ్లందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ లెక్కేసుకుంటే అక్షరాలా 5 సంవత్సరాల వైయస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్.. అన్నీ గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు 6,31,310 మందికి ఉద్యోగాలిచ్చాం. అదే విధంగా లార్జ్ అండ్ మెగా సెక్టార్ లో వీళ్లిచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టులో.. మొట్ట మొదట బడ్జెట్ తో పాటు.. (ఇది మా సోషియో ఎకనామిక్ రిపోర్టు కాదు.) 2023-24కు సంబంధించి వీళ్లు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారమే లార్జ్ అండ్ ఇండస్ట్రీస్ లో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో వైయస్సార్ సీపీ హయాంలో 2019-24 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తంగా వైయస్సార్ సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలైతేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాల్లో 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డు నంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితి ఉంది. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పని చేస్తోంది. ఏ ప్రభుత్వం పిల్లల పట్ల ఎంత నిజాయితీగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వీళ్లు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా, మరోవైపున పారిశ్రామిక వేత్తలను బెదరగొట్టి పంపుతున్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చిన సజ్జన్ జిందాల్ ను బెదరగొట్టి పంపించారు. అరబిందో సంస్థను వీళ్లే బెదిరించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ల హయాంలో పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ రెండు బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నిరుడు సంవత్సరం రూ.36 వేలు, ఈ సంవత్సరం రూ.36 వేలు.. రూ.72 వేలు ప్రతి నిరుద్యోగికీ బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు. ఎగనామం పెట్టాడు. 

ఆడబిడ్డ నిధికీ నీళ్ళోదిలేసిన చంద్రబాబు

 ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మరో హామీ. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకూ.. నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అన్నాడు. ప్రతి ఇంటికీ ప్రచారం చేస్తూ ఆడ బిడ్డ నిధి అని దీనికి ఒక బ్రహ్మాండమైన పేరు పెట్టాడు. నేను అడుగుతున్నా ఇప్పుడు. ఓటర్ల లిస్టుమన కళ్ల ముందే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు వేశారని మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఆధార్ కార్డు నంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. వీళ్లంతా 18 సంవత్సరాలు నిండిన వారే.అందుకే ఓటర్లు అయ్యారు. 2.07 కోట్ల మందిలో 60 ఏళ్లు పైబడిన వాళ్లను తీసేస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు దాదాపుగా. మరి ఈ 1.80 కోట్ల మందికి సంవత్సరానికి 18 వేల చొప్పున కేటాయింపులు చేస్తే రూ.32,400 కోట్లు కేటాయింపులు చేయాలి. నిరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా. ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా. అంటే ప్రతి మహిళకూ చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ రెండు బడ్జెట్లతో కలిపితే రూ.36 వేలు బాకీ ఉన్నాడు. 

 

తుస్సుమన్న ఉచిత బస్సు....

మహిళలందరికీ ఉచిత బస్సు.. ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. నెలకు రూ.275 కోట్లు కావచ్చు. సంవత్సరానికి మహా అయితే రూ.3500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎగరగొట్టేశాడు. మళ్లీ రెండో సంవత్సరం బడ్జెట్లో కనిపించడం లేదు. ఈ సంవత్సరమూ ఎగనామమే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయిరావచ్చు కదా. పోయి చూసిరావచ్చు కదా. బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు వీళ్లంతా మహిళలంతా ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా.. ఏదో అమరావతి కడుతున్నాడు ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, విహార యాత్రకు పోవచ్చు కదా. చూసి రావచ్చు కదా. విశాఖపట్నం నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ పెద్ద మనిషేమో ఇటువంటి చిన్న హామీని నెరవేర్చడానికి చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడు. నిరుడు సంవత్సరం 3500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు, ఎగరగొట్టాడు, బకాయిలు పెట్టాడు. మళ్లీ ఈ సంవత్సరం రూ.3500 కోట్లు. మహిళలకు ఫ్రీ బస్సు రూపేణా మరో రూ.7,000 కోట్లు చంద్రబాబు బాకీ పడ్డారు. ఎగరగొట్టారు. 

తల్లికి వందనం పథకంకూ అరకొర నిధులే...

ఇంకో హామీకి పోదాం. నేను ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. చాలా ఉన్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లే టచ్ చేస్తున్నా ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15000 ఇస్తామన్నాడు. ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు, ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, తల్లికి వందనం అని చెప్పి ఓ మంచి పేరు కూడా పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్ట మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో రూ.5386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతున్నా. మొదటి బడ్జెట్లో తాను కేటాయించిన రూ.5386 కోట్లలో రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టండి. రూ.13 వేల కోట్లకు పైగా కావాలి. చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి దాన్ని పెట్టామంటే పెట్టామన్నట్లుగా దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ లో రూ.9407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్ లోకి వెళ్లి డిమాండ్స్ ఫర్ గ్రాంట్ లోకి వెళ్లి చూస్తే అక్కడ రూ.8278 కోట్లు ఇంకో నంబర్ కనిపిస్తుంది. వాస్తవానికి ఎంత మంది పిల్లలున్నారు, ఎంత డబ్బు ఖర్చవుతుందని లెక్కల్లోకి వెళ్లి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిట్రసీ ఈ డిపార్ట్ మెంట్ కు మన కలెక్టర్లే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లందరూ కూడా వాళ్ల వాళ్ల పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్లాడు చదువుతున్నాడు, ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేస్తారు. అదే యూడీఐఎస్ఈ.  ఇది మ్యాండేటరీగా, పీరియాడికల్ గా, రెగ్యులర్ గా ప్రతి జిల్లా కలెక్టర్ దేశ వ్యాప్తంగా తాను అప్లోడ్ చేస్తుంటాడు. తన జిల్లాలో ఎన్ని స్కూళ్లు, ఆ పిల్లలు ఎవరు, ఏ గ్రామంలో ఎక్కడున్నారు, ఆధార్ కార్డుతో సహా డీటెయిల్స్ పెడుతుంటారు. అది రెగ్యులర్ ప్రాసెస్. మన రాష్ట్రానికి సంబంధించి ఇదే రిపోర్టు, ఇదే వెబ్ సైటులోకి వెళ్లి చూస్తే యూడీఐఎస్ఈ రిపోర్టు 2023-24లో చూస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 87,41,885 మంది పిల్లలు 12వ తరగతి దాకా చదువుతున్నారు. మరి నువ్వు చెప్పిన 15 వేలు లెక్కే కదా. దీనికేమీ రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు కదా. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా, అందరి దగ్గరా ఉన్న ఇన్ఫర్మేషనే కదా. రూ.15 వేల చొప్పున అంటే రూ.13112 కోట్లు. మరి చంద్రబాబు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది రూ.5386 కోట్లు. కేటాయింపులు మాత్రమే ఇచ్చేది ఎలాగూ లేదు కాబట్టి పూర్తిగా ఎగనామమే. రెండో సంవత్సరం ఎంత కేటాయించాడంటే బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ లో ఒక నంబర్ రూ.9407 కోట్లు అని, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో ఏమో కేవలం 8278 కోట్లు అని ఇంకో నంబర్ కనిపిస్తుంది. కానీ ఎక్కడా రూ.13112 కోట్లు అని ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు. ఎలాగూ మోసం చేయడమే. ఏదో ఒక నంబర్ పెట్టాలి అని నడిపిస్తున్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే ప్రతి పిల్లాడికీ చంద్రబాబు రూ.15 వేలు బాకీ పడ్డాడు. ఎగనామం పెట్టాడు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే రూ.30 వేలు ఎగనామం పెట్టినట్లవుతుంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. అయ్యా ఇది చూసే దానికి కూడా బాగుండదయ్యా.. మరీ చిన్న పిల్లల దగ్గర కూడా ఎందుకయ్యా ఈ పద్ధతిలోకి పోతావు చంద్రబాబూ. అస్సలు బాలే.

Source From: రాజాజీ

లేటెస్ట్ న్యూస్