బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా యూనుస్‌


Published on: 07 Aug 2024 12:00  IST

షేక్‌ హసీనా ప్రధాని పదవిని వదిలేసి దేశాన్ని వీడి వెళ్లిపోవడంతో అక్కడ సైన్యం నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనుస్‌ సారథిగా ఈ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్ష కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కేసులు, తాత్కాలిక జైలు శిక్ష నేపథ్యంలో యూనుస్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. హసీనా సర్కారు పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిణామాన్ని దేశానికి రెండో విముక్తిగా అభివర్ణించారు. అంతకుముందు, విద్యార్థి సంఘాల అల్టిమేటం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మొహమ్మద్‌ బుద్దీన్‌ నిర్ణయం తీసుకున్నారు.  అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో ఆధ్య క్షుడు భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు కూర్పుపై వారితో చర్చించారు. విపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎస్పీ) సారథి బేగం ఖలీదా జియా (79)ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు.

Source From: Bangladesh pm