- పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ ను ఖండించిన వైయస్ జగన్

పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన వైయస్ జగన్.  పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని ధైర్యం చెప్పిన వైయస్ జగన్.


Published on: 27 Feb 2025 11:17  IST

అమరావతి: సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు.

Source From: రాజాజీ

లేటెస్ట్ న్యూస్